google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam Project) ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.గ్రామాలు, పట్టణాలు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలు మరియు అనుమానాస్పద ప్రదేశాల్లో డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ చేపట్టి, బహిరంగ మద్యం సేవించడం, జూదం మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి, నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed