google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం , మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి శక్తి టీమ్స్ అవగాహన కార్యక్రమంతో పాటు శక్తి (Shakthi) యాప్ ఇన్‌స్టాలేషన్ మరియు నమోదు (రిజిస్ట్రేషన్) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు మరియు ప్రజలకు శక్తి టీమ్స్ సేవలు, మహిళల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్‌లోని SOS ఫీచర్ ద్వారా తక్షణ పోలీసు సహాయం పొందే విధానం గురించి వివరించారు.అలాగే పాల్గొన్న వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో పాటు యాప్ వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా పోలీసులకు తెలియజేయాలని, శక్తి యాప్‌ను ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.మహిళలు, బాలికలు సురక్షితంగా ఉండే సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed