google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో ప్రత్యేక సర్వైలెన్స్ నిర్వహించారు.డ్రోన్ కెమెరాల ద్వారా బహిరంగ ప్రదేశాలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి వెంటనే పోలీసు బృందాలు స్పందించేలా చర్యలు చేపట్టారు.బహిరంగ మద్యపానం, జూదం మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *