ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఈ కార్యక్రమాల్లో భాగంగా మండల స్థాయి అధికారులు, ఏఎన్‌ఎంలు (ANMs), ఆశా కార్యకర్తలు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత మరియు గ్రామస్థులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మహిళలపై నేరాల నివారణ, బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో (POCSO) చట్టం, మహిళల భద్రత, శక్తి యాప్ (Shakthi App) వినియోగం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఓటీపీ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్స్, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆస్తి నేరాలు, చోరీలు, ట్రాన్స్‌ఫార్మర్ చోరీల నివారణ వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.మహిళలపై వేధింపులు, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ మోసాలు వంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే, సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించకూడదని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ను ప్రతి మహిళ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాలని సూచించారు.ప్రజల సహకారంతో నేరరహిత, మాదకద్రవ్య రహిత, మహిళలకు సురక్షితమైన సమాజ నిర్మాణమే ప్రకాశం జిల్లా పోలీసుల లక్ష్యమని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *