తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పోగొట్టుకున్న మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, CEIR (Central Equipment Identity Register) వ్యవస్థ సహాయంతో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అప్పగించారు.తమ విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి అందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ మార్కాపురం జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. ప్రజల ఆస్తులను రక్షించడం, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం కోసం మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.