ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా కురిచేడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు మరియు పోలీసు సిబ్బంది గంగదొనకొండ గ్రామ పొలాల్లో ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా పేకాట ఆడుతున్న 07 మందిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.13,030/- నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ పేకాట, జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *