తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగవరం అటవీ ప్రాంతంలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ మరియు పోలీసు సిబ్బంది ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి రూ.6,720/- నగదు మరియు 7 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.పరారీలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో జూదం, పేకాట లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.