తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేసి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్, నంబర్ ప్లేట్లు మరియు ఇతర నిబంధనలను పరిశీలించారు. అలాగే అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.