ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో శక్తి (Shakthi) యాప్ డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు మరియు ప్రజలకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలను వివరించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణమే పోలీసులకు సమాచారం చేరడంతో పాటు, మహిళలకు వేగవంతమైన పోలీసు సహాయం అందుతుందని వివరించారు.అలాగే మహిళలపై నేరాల నివారణ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, వ్యక్తిగత భద్రతా చర్యలు మరియు అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *