జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం దిగువమిట్ట మరియు బురుజుపల్లి గ్రామాల్లోని పాత బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.దిగువమిట్ట గ్రామంలో నిర్వహించిన దాడిలో 180 మి.లీ. చొప్పున 17 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.అదేవిధంగా బురుజుపల్లి గ్రామంలోని పాత బెల్ట్ షాపుపై నిర్వహించిన దాడిలో 180 మి.లీ. చొప్పున 8 అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఈ రెండు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *