తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, విద్యార్థిల విద్యార్థినుల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిల ,విద్యార్థినులతో ప్రత్యక్షంగా మమేకమైన పోలీసులు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, మహిళలు మరియు బాలికలపై జరిగే నేరాలు, ఈవ్ టీజింగ్, ఫోటో మార్ఫింగ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రోడ్డు భద్రతా నియమాలు గురించి సమగ్రంగా వివరించారు.ఎలాంటి వేధింపులు, సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద సంఘటనలు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, చట్టాలపై అవగాహనతో నేరాలను నివారించవచ్చని తెలియజేశారు.