తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, యువతులు, విద్యార్థినుల కోసం శక్తి యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు ఎలా సమాచారం అందించాలి, SOS అలర్ట్‌ను ఎలా వినియోగించాలి, వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణ పోలీసు సహాయం ఎలా పొందవచ్చో వివరంగా తెలియజేశారు.అనంతరం మహిళలు, విద్యార్థినుల మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవను ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా శక్తి యాప్ గురించి తెలియజేసి డౌన్లోడ్ చేయించాలని పోలీసులు కోరారు.మహిళల భద్రత, సాధికారత మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు సేవలు అందించడంలో శక్తి యాప్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి మహిళ తమ మొబైల్లో ఈ యాప్‌ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.