ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు పునరావృత నేరాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా చట్టబద్ధమైన జీవన విధానాన్ని అవలంబించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజల సహకారంతో నేరరహిత, శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసు శాఖ లక్ష్యమని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *