తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమ పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరేటిపల్లి గ్రామ శివారు పొలాల్లో నిర్వహించిన దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,080/- నగదు మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను పోలీసులు కోరారు.