ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెండింగ్‌లో ఉన్న U.I. (Undetected Investigation) కేసుల తుది పరిష్కారం, చార్జ్‌షీట్ల తయారీ, కోర్టుల నుంచి రిటర్న్ అయిన చార్జ్‌షీట్ల పునఃసమర్పణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న యూ.ఐ. కేసులను త్వరితగతిన పూర్తి చేసి చార్జ్‌షీట్లు సిద్ధం చేయాలని, కోర్టుల నుంచి తిరిగి వచ్చిన చార్జ్‌షీట్లలో ఉన్న లోపాలను సరిదిద్ది వెంటనే పునఃసమర్పించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.నాణ్యమైన దర్యాప్తు, సకాలంలో చార్జ్‌షీట్ల దాఖలు, పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *