తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా,సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ మేడూరి రాఘవులు తమ ఊరి పాఠశాల మీద, విద్యార్థుల మీద అభిమానంతో గురువారం (6.8.2026) శానంపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కి ఐదు వేల రూపాయలు విలువచేసే 60 స్టీల్ ప్లేట్లు మరియు 60 స్టీల్ గ్లాసులు పాఠశాలకు బహుకరించారు. అలాగే కాలిఫోర్నియాలో ఉంటున్న రాఘవులు గారి మనవరాలు శ్రీమతి గొట్టిపాటి శ్రావ్య గారు సుమారు 70,000 విలువ చేసే లాప్టాప్ మరియు ప్రింటర్ ను పాఠశాలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.వీరమ్మ గారు, ఉపాధ్యాయులు మందలపు సురేష్ బాబు , సుధాకర్ రావు , శ్రీరాముడు , వెంకటేశ్వర్లు, శ్రీదేవి మరియు సులోచన గార్లు పాల్గొని రాఘవులు గారికి కృతఙ్ఞతలు తెలిపారు.