తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బి. మాచవరం పంచాయతీ గ్రామం శివారులో తేదీ:08.08.2026న సాయంత్రం సమయంలో పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారు ఆధ్వర్యంలో S I .B. వినోద్ బాబు, ASI షేక్ మహబూబ్ బాషా మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురుని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.11,600/- నగదు, 5 మొబైల్ ఫోన్లు ఐదు మోటర్ సైకిల్లు ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించడం అయినది .ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.