పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను గుర్తించి సంబంధిత యజమానికి అప్పగించిన మార్కాపురం రూరల్ పోలీసులు – పోలీసుల సేవలను అభినందించిన బాధితులు ప్రకాశం జిల్లా మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను మార్కాపురం రూరల్ పోలీసులు సమర్థవంతంగా గుర్తించి, దానిని సంబంధిత మొబైల్ యజమానికి సురక్షితంగా అప్పగించారు.మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న విషయం పోలీసుల దృష్టికి తీసుకురావడంతో, మార్కాపురం రూరల్ ఎస్‌ఐ గారి పర్యవేక్షణలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. అనంతరం మొబైల్‌ను సంబంధిత వ్యక్తికి అప్పగించడం జరిగింది.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను తిరిగి అందజేసినందుకు బాధితుడు మార్కాపురం రూరల్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రజలు తమ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *