తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
వీవీ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-167B రహదారిపై విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ మరియు ప్రజల సురక్షిత ప్రయాణం కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.వీవీ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-167B జాతీయ రహదారిపై వీవీ పాలెం ఎస్‌ఐ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధంగా నియంత్రించారు.అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని వివరించి, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం వంటి భద్రతా సూచనలు అందించారు.ప్రజల సురక్షిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని మరింత కఠినంగా కొనసాగిస్తామని వీవీ పాలెం ఎస్‌ఐ తెలిపారు. రాత్రి సమయాల్లో కూడా ప్రత్యేక గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.