తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
రేషన్ డీలర్ల పరిస్థితి రోజుకు దిగజారుతోంది రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని డీలర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు . ప్రతి బస్తా ను క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కాటా పెట్టి వేయింగ్ నోట్ చేసుకుని దించుకోవడం. ఎంతో పని భారంతో కూడుకున్న పని అని వాపోతున్నారు అదేవిధంగా రేషన్ షాపుల్లో నడుపుతున్న వారిలో మహిళలు వృద్ధులు ఎంతోమంది ఉన్నారు వారందరూ ప్రతి 50 కేజీల బస్తాలు కాటాపై పెట్టి స్కాన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని కావడంతో డీలర్లంతా ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసివేయాలని కోరుతున్నారు… అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే కమిషన్ కేజీకి రూపాయి నుండి రెండు రూపాయలు పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. ఈ క్యూయర్ కోడ్ తక్షణమే తీసివేయాలని కోరుతూ టంగుటూరు ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనాథ్ ని కలసి వినతి పత్రం సమర్పించిన టంగుటూరు మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు.