ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, యువతకు మహిళలపై నేరాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రత, హెల్మెట్‌ వినియోగం, ట్రాఫిక్‌ నిబంధనలు, దొంగతనాల నివారణ, గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, మహిళల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTPలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అధిక వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అదేవిధంగా దొంగతనాల నివారణ, గంజాయి వినియోగం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం – అవగాహనతోనే నేరాల నివారణ సాధ్యం. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీస్‌ శాఖకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *