ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 46 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, ఐపీఎస్., గారు మరియు పోలీసు అధికారులతో కలిసి సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం” (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదిదారుల నుంచి అధికారులు వ్రాతపూర్వక వినతులను స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరిధిలో విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఫిర్యాదిదారులకు భరోసా కల్పించారు.అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో అధికారులు మాట్లాడి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా అందజేయవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు