ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని బ్లాక్‌ స్పాట్లు, ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతాలు (Accident Prone Areas), ప్రమాదకర మలుపులు తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కన్వెక్స్‌ మిర్రర్ల (Convex Mirrors) స్థానాలను కూడా తనిఖీ చేసి, అవసరమైన చోట్ల వాటి స్థానాలను సరిచేసే (Rectification) చర్యలు చేపట్టారు.ప్రమాదాలకు కారణమయ్యే రహదారి పరిస్థితులు, విజిబిలిటీ సమస్యలు, మలుపుల వద్ద ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు.రోడ్డు భద్రతలో భాగంగా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.ప్రమాదాల నివారణ – ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రకాశం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *