గ్రామాల్లో రాత్రి బస – ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా ఆరా – శాంతిభద్రతలపై ప్రత్యేక పర్యవేక్షణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేకంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పోలీసుల ఉనికిని మరింత పెంచడంతో పాటు, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.పోలీసు అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేసి, స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గ్రామంలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నివారణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.అదేవిధంగా గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, సున్నిత ప్రాంతాల పర్యవేక్షణ చేపడుతూ ప్రజల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.