సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం – గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో ఒంగోలు అదనపు ఎస్పీ (క్రైమ్స్) గారు కందుకూరు ఎస్డీపీఓ కార్యాలయంలో కందుకూరు సబ్డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు, విగ్రహాల ఊరేగింపులు మరియు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ మ్యాప్, నిమజ్జన ప్రాంతాల భద్రత, లైటింగ్, బారికేడింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా మరియు సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని అధికారులు సూచించారు.