వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.వినాయక మండపాల వద్ద భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే నేపథ్యంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ సిబ్బందిని మోహరించారు. మండపాల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా పండుగ కార్యక్రమాలను నిర్వహించాలని పోలీసులు సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు సురక్షితంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు 24/7 అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *