మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సీఐ గారి పర్యవేక్షణలో, పుల్లలచెరువు మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా రక్షించారు.
పుల్లలచెరువు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా మారి, రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీరు ప్రవహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై రహదారి దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి బలమైన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా గుడిపోడా గ్రామానికి చెందిన సునీల్ కుమార్ తెల్లవెహ్రా (36) నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ సమీపంలోని చెట్టును పట్టుకుని సహాయం కోసం కేకలు వేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పుల్లలచెరువు ఎస్సై గారు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక గ్రామస్థుల సహకారంతో తాళ్లను ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం వాగులో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రహదారులపై ప్రయాణించకుండా పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *