ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగంలో పరిశోధకుడు మరియు డైట్ లెక్చరర్ అయిన టి.వి. రామచంద్రరావు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) పట్టా పొందారు.ఆయన “An Economics of Tobacco Cultivation in Prakasam District of Andhra Pradesh” అనే అంశంపై పరిశోధన చేసి తన పీహెచ్‌డీ థీసిస్‌ను సమర్పించారు. ఈ పరిశోధనను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఆర్థికశాస్త్ర విభాగాదిపతి ప్రొఫెసర్ కె. మధు బాబు గారి పర్యవేక్షణలో నిర్వహించారు.పరిశోధకుడు సమర్పించిన థీసిస్‌ను నియమిత పరీక్షకులు పరిశీలించి, వారి సిఫారసుల మేరకు 01-09-2026 నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) డిగ్రీ ప్రదానానికి అర్హత సాధించినట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధన–అభివృద్ధి విభాగం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. రామచంద్రరావు చేసిన పరిశోధనలో ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు యొక్క ఆర్థిక అంశాలు, సాగు వ్యయం, రైతుల పరిస్థితులు మరియు పొగాకు సాగుకు సంబంధించిన వివిధ సమస్యలు వంటి అంశాలను అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా పీహెచ్‌డీ సాధించిన టి.వి. రామచంద్రరావును డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు గారు, తోటి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు. తన పరిశోధన విజయానికి మార్గదర్శకత్వం వహించిన ప్రొఫెసర్ కె. మధు బాబు గారికి, మరియు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *