ఆపరేషన్లు చేయించుకున్న 72 మందికి 46 లక్షలు అందజేత
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నియోజకవర్గంలో 93 మందికి మంజూరైన… వైద్య సహాయానికి సంబంధించిన చెక్కులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం అందించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కందుకూరు అర్బన్ పరిధిలోని 15 మందికి 10,61,727 రూపాయలు, కందుకూరు మండల పరిధిలోని 12 మందికి 6,15,556 రూపాయలు, వలేటివారిపాలెం మండలంలోని 10మందికి 2,94,353 రూపాయలు, లింగసముద్రం మండలంలోని 9 మందికి 5,83,957 రూపాయలు, గుడ్లూరు మండల పరిధిలోని 8 మందికి 7,61,128 రూపాయలు, ఉలవపాడు మండల పరిధిలోని 18 మందికి 13,30,115 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గారు అందించారు. తక్షణ వైద్య సహాయం (ఎల్ ఓసి) క్రింద 21 మంది పేదలకు 38 లక్షల రూపాయల వైద్య సహాయాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… అభివృద్ధితో సమానంగా సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో 43వ విడతగా గురువారం సహాయాలు అందించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 1655 మందికి 12.6 కోట్లు అందించామన్నారు. మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసిపి పదేపదే అడ్డుపడుతోందని, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతోందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు విమర్శించారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే ఆ పార్టీకి తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేర్చే విధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడిగిన వెంటనే, రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, నియోజకవర్గ పేదలందరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, జనిగర్ల నాగరాజు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాదాల లక్ష్మీనరసింహం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పొట్టేళ్ల మురళి, పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ అధ్యక్షులు షేక్ మున్నా, అల్లం వెంకటేశ్వర్లు, ముచ్చు శ్రీను, పొడపాటి మహేష్, కల్లూరి శైలజ, మన్నం శైలజ, వడ్డేళ్ళ రవిచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు.
