కందుకూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, విద్యుత్ సరఫరాలో సమస్యలు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు, అన్ని మండలాల AEలు సమావేశంలో పాల్గొన్నారు. మండలాల్లో విద్యుత్ సమస్యలు, జరుగుతున్న పనులు, RDS స్కీం ద్వారా గ్రామాల్లో అమలవుతున్న కార్యక్రమాలు, కొత్త ప్రతిపాదనలపై ఎమ్మెల్యే గారు సమీక్ష చేశారు.ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు, ఇతర పరికరాలు మార్చటం, ఇంకా ఫిర్యాదుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని, నిత్యం ప్రతిచోటా వారిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. చిన్న పని కోసం కూడా అనేకసార్లు తిప్పించుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.తమకు అందుతున్న విద్యుత్ సేవల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, వారిలో సంతృప్తి శాతం పెంచే విధంగా ఇకనుంచి సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరావు వారిని ఆదేశించారు. ఏడాది ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున… రైతుల డిమాండ్ కు అనుగుణంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్తు సరఫరా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *