గణేష్‌ ఉత్సవాల ముగింపు సందర్భంగా రామాయపట్నం మరియు అలగాయపాలెం బీచ్‌లలో గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రకాశం జిల్లా పోలీసుల పటిష్ట భద్రతా పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.నిమజ్జన ప్రాంతాల్లో భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలు, వాహనాల రద్దీ, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ, సముద్ర తీర ప్రాంతాల భద్రతపై పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సముద్రంలోకి ప్రమాదకరంగా వెళ్లకుండా భక్తులను అప్రమత్తం చేస్తూ, చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పోలీసుల సూచనలు మరియు భద్రతా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *