తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:
సీడీపీవో అంజమ్మ అనుమతితో సూపర్వైజర్ సుచరిత ఆధ్వర్యంలో టంగుటూరు బీసీ కాలనీ, పిచ్చిగుంట్లపాలెం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతను వివరించారు.
పౌష్టికాహార లోపం వల్ల కలిగే సమస్యలు, తీసుకోవాల్సిన సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో చైల్డ్‌లైన్ ఆఫీసర్ పూర్ణిమ, అంగన్వాడీ కార్యకర్తలు కల్పన, సుజాత, ఆయాలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.