ముందస్తుగా శనివారం తౌశిక్ మరియు మౌలాబి మృతి పై సమగ్ర సమాచారాన్ని సేకరించడం కొరకు MSP రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్చార్జ్ సొట్ట నరేంద్రబాబు మాదిగ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన నాయకులు సింగరాయకొండకు చేరుకొని లోతుగా విశ్లేషించి సమర్పించిన నివేదిక ఆధారంగా నేడు ఉదయం 10 గంటలకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సింగరాయకొండకు రానున్నారు.

14.02.2026 న శ్రీ చైతన్య నవోదయ స్కూల్ లో జరిగిన తౌఫిక్ అనుమానస్పద మృతి ( స్కూల్ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలను చూసాడనే కారణం తో స్కూల్ యాజమాన్యమే చంపి ఉరేసారని తండ్రి ఆరోపణ )…
తన కుమారుడు చావు కు స్కూల్ యాజమాన్యమేనని, నిజాన్ని నిగ్గు తెల్చాలని నిందుతులను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పోలీసులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని 15రోజులు స్కూల్ ముందే మౌన దీక్ష చేసిన తల్లి మౌలాబీ, స్కూల్ యాజమాన్యం పెట్టే టార్చర్, అవమానాలు తట్టుకోలేక, సూసైడ్ నోట్, వీడియో చేసి చివరకు స్కూల్ ముందే గద్దిమందు త్రాగి చనిపోయింది…
ఈ సంఘటనల గురించి, న్యాయ పోరాటం చేస్తున్న తండ్రి ఆలీ గురించి తెలిసిన…

శనివారం MSP రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ఇంచార్జి సొట్ట నరేంద్ర బాబు మాదిగ తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకుల బృందం సింగరాయకొండ లో బాధితుడు ఆలీ గారిని పరామర్శించి, ఈ సంఘటనలకు సంబందించిన అన్ని విషయాలను తండ్రి ఆలీ, మైనార్టీ సంఘం నాయకులు సుల్తాన్, పటేల్ లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది.తండ్రి ఆలీ, ప్రముఖ మైనారిటీ సంఘం నాయకులు సుల్తాన్ గార్లతో మంద కృష్ణ మాదిగ గారు ఫోన్ లో మాట్లాడి పరామర్శించడం జరిగింది..
అలాగే బాలుడు తౌఫిక్ మృతదేహం దొరికిన స్కూల్ బిల్డింగ్ లోని బాత్ రూమ్ ను పరిశీలించడానికి వెళ్లిన బృందానికి, పరిశీలించడానికి అవకాశం లేకుండా బిల్డింగ్ కు తాళాలు వేయడం జరిగింది. ఇక అక్కడ నుండే మీడియా తో మాట్లాడడం జరిగింది.ఈ విషయాల నివేదిక ను మంద కృష్ణ మాదిగ గారికి అందజేసి, అతి త్వరలో మంద కృష్ణ మాదిగ గారు సింగరాయకొండ లో బాధితులను పరామర్శించేలా చూస్తామని తెలిపారు…ఈ కార్యక్రమం లో MRPS ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు నేలపాటు రాజు, MSP జిల్లా సీనియర్ నాయకులు రావినూతల చంద్ర, తిరువీదుల బాబు, సోషల్ మీడియా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రా, రాజారావు, ముత్తు, కాంతారావు, VHPS నాగేశ్వరావు యాదవ్, సుబ్బారావు లతో పాటు ఉమ్మడి జిల్లా, కొండేపి నియోజకవర్గ నాయకులు, సింగరాయకొండ మండల నాయకులు పాల్గొన్నారు…

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *