తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు ప్రకాశం జిల్లా దిశ వారి ఆధ్వర్యంలో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ పై ఐ ఈ సి కాంపెయిన్ మరియు ఎయిడ్స్ పై విసృత ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా స్థాయిలో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ పై క్విజ్ పోటీలు ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించినారూ ఈ క్విజ్ పోటీలకు ఉలవపాడు మండలం చాకిచెర్ల హై స్కూల్ హెచ్ యం సార్ గారు శ్రీ కావూరి జనార్దన్ రావు గారి సహకారంతో చాకిచెర్ల హై స్కూల్ నుండి మిరియం యశస్విత మరియు మిరియం వెంకట నాగ హరిణిశ్రీ అను ఎనిమిదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు వీరికి ప్రకాశం జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు ఈ బహుమతిని ప్రకాశం జిల్లా లేప్రసి ఎయిడ్స్ మరియు టి బి అధికారి డా , జి బాలాజీ సార్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగినది, స్థానిక లింక్ వర్కర్ వీరమల్లు రవీంద్ర మాట్లాడుచు యువత చిన్న వయస్సు నుండి హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, ఈ క్విజ్ పోటీలో పాల్గొని జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో దిశ సి పి ఓ, శ్రీ కిరణ్ కుమార్, దిశ సి పి యం, అమీన్ సార్, సి ఎస్, ఓ, సాయి సార్ లింక్ వర్కర్ స్కీమ్ డి ర్ పి గాలి స్వరూప్ కుమార్ ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అనిల్ బాబు పాల్గొనడం జరిగినది