తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
ముండ్లమూరు మండలం బట్లపల్లి–నూజిళ్లపల్లి–మారెళ్ల రహదారి నిర్మాణానికి ₹4.14 కోట్లతో చేపట్టిన పనులకు దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ గారు మాట్లాడుతూ.. ముండ్లమూరు మండలంలో ఇప్పటికే ₹10 కోట్లకు పైగా రహదారి పనులు చేపట్టామని, ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.ఓటమి తర్వాత కూడా ప్రజల మధ్యే ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం.. మీలో ఒకరిగా, మీ ఇంటి ఆడబిడ్డగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.