కిడ్నీమార్పిడికి 10 లక్షలు సహాయం – వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన హుస్సేన్‌.. ఫోటో స్టూడియో నడుపుకుంటున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా. హుస్సేన్ కు భార్య, ఇద్దరు చిన్న వయసున్న కూతుళ్లు ఉన్నారు.హుస్సేన్ కు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయాయి. కిడ్నీ ఇచ్చేందుకు, అతని తల్లి సిద్ధంగా ఉంది. కానీ ఆపరేషన్ కు డబ్బులు లేవు. రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, పోకూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి హరికృష్ణ… హుస్సేన్ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, వెంటనే స్పందించి, 5 లక్షలు సహాయం అందించారు.ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సిఫార్సుతో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా హుస్సేన్ కు మరో 5 లక్షలు మంజూరయ్యాయి.కష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, గొట్టిపాటి హరికృష్ణకు హుస్సేన్‌, ఆయన కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *