కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టూ సెక్టార్ నందు విక్కీరాలపేట అంగన్వాడీ కేంద్రం లో సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ జాతీయ పోషణ మాససోత్సవo జరిగింది ఈ కార్యక్రమం లో సువర్ వైసర్ యల్ లక్ష్మి దేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందించే సేవలు గర్భిణీ, బాలింతలు పిల్లలు, అర్హులైన వారందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని,అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు మధ్యాహ్నం తాజా వేడి భోజనం పెడతారని, మూడు సంవత్సరాలనుండి ఆరు సంవత్సరాల వయసు పిల్లలు అందరిని ప్రీ స్కూల్ కీ పంపించాలని, ప్రవేటుస్కూల్ కీ దీటుగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు విద్య ను అందిస్తారని, అంగన్వాడీ కేంద్రాలు, తల్లిదండ్రులు మధ్య సమన్వయo మరింత బలోపేతం చేసుకో వాలని వివరించాము ఈ కార్యక్రమం నకు అంగన్వాడీ కార్యకర్తలు పి మహేశ్వరీ, పద్మావతి ఆయా లు దయమ్మ మాలకొండమ్మ తల్లులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *