దర్శి పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా చేపడుతున్న మున్సిపల్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.12 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు శనివారం ఉదయం దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పొదిలి రోడ్‌లోని 6వ వార్డులో మూడు CC రోడ్లకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నామని డా. లక్ష్మీ గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారా చంటి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, దిరిశాల రామకృష్ణ, నేలకుర్తి మాల్యాద్రి, శ్రీను, కల్లూరి నాగేష్, మలగ శివ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *