ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, స్థానిక పరిస్థితులు, శాంతిభద్రతలు మరియు భద్రతా అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.పల్లె నిద్రలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.అదేవిధంగా రాత్రి వేళల్లో పోలీసు గస్తీ, నిఘా మరియు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *