తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు మరియు ముఖ్య కూడళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం, ట్రిపుల్ రైడింగ్, నంబర్ ప్లేట్ నిబంధనలు పాటించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించారు.నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై నిబంధనల ప్రకారం ఈ-చలాన్లు విధించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారిపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, సీట్ బెల్ట్ ఉపయోగించి, వేగ పరిమితులను పాటిస్తూ, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.