ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో చెడు నడత కలిగిన వ్యక్తులను గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నేరాల నియంత్రణలో భాగంగా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *