ఈనెల 29న ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గం నుంచి కార్యక్రమానికి తరలివెళ్లే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాను.ప్రతి మండలానికి కేటాయించిన ఆర్టీసీ బస్సులకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యులుగా నియమించి, ప్రజలను సురక్షితంగా కార్యక్రమానికి తీసుకెళ్లడంతో పాటు తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే వరకు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని అధికారులకు సూచించాను.అలాగే పల్లె పండుగ 3.0లో భాగంగా నియోజకవర్గం నుంచి పంపించిన ప్రతిపాదనలు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై కూడా చర్చించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *