ఈనెల 29వ తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో జరగబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు ఉలవపాడు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ఉలవపాడులో ఆదివారం సాయంత్రం టిడిపి శ్రేణులతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే నాగేశ్వరావు గారు మాట్లాడుతూ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు హాజరవుతున్నారని చెప్పారు. ఉలవపాడు మండలానికి 15 ఆర్టీసీ బస్సులు కేటాయించామని, అన్ని గ్రామాల్లో నేతలు, కార్యకర్తలు తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ సమావేశంలో మండల పరిశీలకురాలు, వాడవల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యురాలు గుండవరపు పద్మావతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జ్ పోలుబోయిన శ్రీనివాసులు, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దసాని మహేంద్ర, కార్యదర్శి దార్ల యలమందమ్మ, మండలంలోని అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *