స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణపై సమీక్ష – సిబ్బందికి పలు సూచనలు చేసిన కందుకూరు డీఎస్పీ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ గారు కొండపి పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, కేసులకు సంబంధించిన రికార్డులు, ఫైల్స్ మరియు ఇతర ముఖ్యమైన దస్తావేజులను సమగ్రంగా తనిఖీ చేశారు.పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత సిబ్బందితో సమీక్షించారు.ప్రజలకు పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా అందేలా విధులు నిర్వహించాలని, ఫిర్యాదులపై సత్వర స్పందన, కేసుల దర్యాప్తులో నాణ్యత, రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సిబ్బందికి సూచించారు.ఈ వార్షిక తనిఖీలో కొండపి సీఐ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.