తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
రాష్ట్ర, బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ గత 12 ఏళ్లుగా మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన వేటపాలెం మండలం, కొత్తపేట, సంపత్ నగర్‌కు చెందిన నాయక్ జయచంద్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వరప్రసాద్ జాతీయ జెండాతో ఆయనకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, తదుపరి కార్యాచరణను వివరించారు. దానిలో భాగంగా, ఈరోజు ఆయన భార్య హెప్సీ తన భర్త మరణ ధృవీకరణ పత్రంతో బాపట్ల నరశెట్టివారి పాలెంలోని మాజీ సైనికుల కార్యాలయానికి రాగా, వర ప్రసాద్ సేవా కేంద్రం ద్వారా ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, కుటుంబ పింఛనుకు సంబంధించిన సేవలను అందించారు. ఇంతటి విషాదకరమైన పరిస్థితిలో ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న హెప్సీ, సంఘంలోని మాజీ సైనికులకు అండగా నిలిచి, అన్ని విధాలా సహాయం చేసి, వారి అవసరాలు, సమస్యలను పరిష్కరించి, ఓదార్చిన సంక్షేమ సంఘం అధ్యక్షుడు వర ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర ప్రసాద్ మాట్లాడుతూ, మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు అండగా నిలబడి, వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. వర ప్రసాద్ వంటి అంకితభావం కలిగిన ప్రజా సేవకుడు లభించడం తమ అదృష్టమని సంక్షేమ సంఘం సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.