మొబైల్ పోగొట్టుకున్న బాధితుడికి ఊరట – పొన్నలూరు మరియు కురిచేడు పోలీసులు చొరవతో మొబైల్ ఫోన్ సురక్షితంగా స్వాధీనం ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో భాగంగా పోన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు ,కురిచేడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపట్టారు.మిస్సైన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు మొబైల్‌ను ట్రేస్ చేసి గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, తగిన ధృవీకరణ అనంతరం దాని అసలు యజమానికి సురక్షితంగా అప్పగించారు.మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందడంలో చొరవ చూపిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *