టంగుటూరు మండలం జమ్ములపాలెంస్థానిక మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ చైర్మన్‌గా గూడూరి యమున, వైస్ చైర్మన్‌ గా మద్దులూరి అనూష, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ప్యానల్‌ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా అభినందించారు. అనంతరం పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలలో తల్లిదండ్రుల భాగస్వామ్యంపై చర్చించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జమ్ములపాలెం పెద్దలు మక్కిన వెంకట్రావు పాల్గొని, విచ్చేసిన తల్లిదండ్రులందరికీ పాఠశాల తరఫున భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *