రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్బాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
రద్దు చేసిన 27 ఎస్సీ, ఎస్టీ దళిత పథకాలను పునరుద్ధరించాలని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, ఎస్సీ–ఎస్టీ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలేటి మహేష్ చేపట్టిన నిరాహార దీక్షను నాలుగో రోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం,మాలల జేఏసీ, జై భీమ్ రావు పార్టీ అధ్యక్షుడు కె.వి కృష్ణా రావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, మాధవ, ఇండియన్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం,దళిత ప్రజాసంఘాల నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్బాబు మాట్లాడుతూ.. రద్దయిన 27 దళిత పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్లో మాలలు, మాదిగలు సహా 59 ఎస్సీ ఉపకులాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు.జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు కేవీ కృష్ణారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావు నేతల కోటి మాదిగ, మాలల సంఘం అధ్యక్షుడు కొప్పోలు ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ నాయకులు మాధవ్, దాసరి సుందరం తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాలల గౌరవ సలహాదారులు మేడిది రవి, బంటుపల్లి రాజు, ఎర్రజర్ల రమేష్, జ్యోతి రమేష్,అడ్వకేట్ బాబురావు, టి.క్రాంతి, ఉద్యోగ సంఘ నాయకులు టి.శ్రీకాంత్, శ్రీధర్, కనపర్తి కొండయ్యతో పాటు పలువురు దళిత ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.