తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మాపై అక్రమ కేసులు పెడుతున్నామని సోషల్ మీడియాలో, ప్రెస్‌మీట్లలో చేస్తున్న ఆరోపణలకు స్పష్టంగా సమాధానం చెబుతున్నాం.గత రెండేళ్ల మూడు నెలల్లో ఏ కార్యకర్తపైనా, ఏ వైసీపీ నాయకుడిపైనా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించలేదు. అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు.ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి?
యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి?
కందుకూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి?అనే ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాం.గత రెండేళ్ల మూడు నెలల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.