ఒకరిపై 6A కేసు నమోదు చేసిన అధికారులు
తొలి శుభోదయం న్యూస్ చిలకలూరిపేట:-
చిలకలూరిపేట పట్టణ పరిధిలోని బోసు రోడ్డు, ఎరువుల గోడౌన్ వెనుక భాగంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.శనివారం (03.10.2026) సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో అందిన సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తన్నీరు నాగమ్మ అనే మహిళ అక్రమంగా నిల్వ ఉంచిన 12 బస్తాల (మొత్తం 6 క్వింటాళ్లు) పిడిఎస్ (PDS) బియ్యాన్ని గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని నిల్వ ఉంచిన తన్నీరు నాగమ్మపై 6A (6E) ప్రకారం కేసు నమోదు చేశారు.ఈ తనిఖీలు మరియు స్వాధీనం ప్రక్రియలో పల్నాడు జిల్లా అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ షేక్ రోషన్ జమీర్ భాషా, డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, విఆర్వో షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.